Mar 08,2023 21:32

ప్రజాశక్తి - పాలకొల్లు
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతిస్తోందని జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ చెప్పారు. స్థానిక వైసిపి కార్యాలయంలో వైజాగ్‌లో జరిగిన పారిశ్రామిక సదస్సు విజయవంతం అయిన సందర్భంగా బుధవారం సమావేశం నిర్వహించారు. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో భవిష్యత్తు ఎపిదే అన్నారు. జగన్‌ చేస్తున్న పారిశ్రామిక విధానాలకు త్వరలోనే మంచి ఫలితాలు కనబడతాయని, త్వరలో ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్‌సి కమిషన్‌ సభ్యులు, చెల్లెం ఆనంద ప్రకాష్‌, డిసిఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ యడ్ల తాతాజీ, జెడ్‌పిటిసిలు నడపన గోవిందరాజులు, గుంటూరు పెద్దిరాజు, ఎంపిపి సుమంగళి పాల్గొన్నారు. అనంతరం మహిళలను సత్కరించారు.