May 31,2023 09:00

రాళ్లఅనంతపురం గ్రామంలో ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీచరణ్‌

      కళ్యాణదుర్గం : రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ ఫలం అందాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌ కల అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు. కంబదూరు మండల పరిధిలోని రాళ్ల అనంతపురం గ్రామంలో మంగళవారం ఆమె స్థానిక నాయకులతో కలిసి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ప్రతి ఇంటి దగ్గరికీ వెళ్లి ప్రజల సాధక బాధలు విన్నారు. ఏమైనా సమస్యలుంటే అక్కడే ఉన్న సంబంధిత అధికారులతో చర్చించి వాటికి పరిష్కార మార్గాలు చూపించారు. ప్రతి ఇంటిలో ఏదో ఒక సంక్షేమ ఫలితం దక్కుతుండటంతో గ్రామాల్లో జగన్‌కు మరింత ఆదరణ లభించడం ఆనందదాయకమన్నారు. మంత్రి వెంట వివిధ శాఖల అధికారులు, వైసిపి నాయకులు ఉన్నారు.