ఎంపీపీ అమరావతి
ప్రజాశక్తి - బంగారుపాళ్యం: సంక్షేమ ఫలాలను త్వరగా పూర్తిచేయాలని ఎంపీపీ అమరావతి అన్నారు. గురువారం మండల కార్యాలయంలో మండల అధికారులతో సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం ఎంపీడీవో గౌస్ బాషా ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా ఎంపీపీ అమరావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు అందించే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారునికి చేర్చాలన్నారు. అదేవిధంగా అర్హత ఉండి రాని వారిని గుర్తించి వారికి సంక్షేమ ఫలాలు అందే విధంగా చూడాలన్నారు. గహ నిర్మాణ శాఖపై సచివాలయ సైట్ ఇంజనీరు, హౌసింగ్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ప్రత్యేక శ్రద్ధగా కనబరచి త్వరగా జగనన్న గహాలను పూర్తిచేసే విధంగా లబ్ధిదారులకు సహకరించాలన్నారు. అనంతరం 8 సచివాలయ గ్రామ వాలంటీర్ల సమీక్ష సమావేశం జరిగింది. ఎంపీడీవో గౌస్ బాషా మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని సమయానికి విధులకు హాజరుకావాలని లేనిచో అట్టి వరిపై తగిన చర్యలు తీసుకోబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ అభిషేక్, పంచాయతీ కార్యదర్శులు దుర్గాప్రసాద్, కవిత ప్రియదర్శిని, చంగల్ రాయలు, తారకేశ్వరి, హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ బాబు, సతీష్, సచివాలయ సైట్ ఇంజినీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.










