Nov 30,2022 22:20

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు

సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లండి
ప్రజాశక్తి -యాదమరి: సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు అన్నారు. బుధవారం కొత్తపల్లి గ్రామంలో ప్రతి గడపనూ సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయ పరిధిలోని వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన వారికి అందించాలన్నారు. గ్రామంలో కొంతమంది పెన్షన్‌, జగనన్న ఇల్లు కావాలని ఎమ్మెల్యే దష్టి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన కొంతమంది రైతులకు ఎక్స్‌ప్రెస్‌ హైవే ఆరు వరుసల రహదారిలో తమ భూములు కోల్పోయా మన్నారు. అయితే తమకు నష్టపరిహారం మంజూరులో కావడం లేదని గ్రామానికి చెందిన జయలక్ష్మి, రామ్మూర్తి, శంకరయ్య, వెంకయ్య ఎమ్మెల్యే మొరపెట్టుకున్నారు. ఆయన స్పందిస్తూ కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో సిమెంట్‌ రోడ్డు, డ్రైనేజీ కాలువలు మంజూరు చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నవరత్నాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు ధనంజయ రెడ్డి, మండల అధ్యక్షుడు సురేష్‌, ఉపాధ్యక్షులు హరినారాయణ రెడ్డి రవీంద్ర, మాజీ జెడ్పిటిసి కోనాపల్లి మనోహర్‌, మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మనోహర్‌ రెడ్డి , సర్పంచులు మీనా మనోజ్‌ రెడ్డి వాసుదేవ రెడ్డి, జెకె రవి, తహశీల్దార్‌ చిట్టిబాబు, మండల అభివద్ధి అధికారి శివరాజ్‌, ఎస్‌ఐ సుమన్‌, ఎంఈఓ రుక్మిణి, ఏపీఎం కల్పలత రెడ్డి, ఏపీఓ కవిత, ఏఈలు గుర్రప్ప,జయ చంద్రారెడ్డి, నవీన్‌, , శ్రీనివా సులు అన్ని శాఖలమండల స్థాయి అధికారులు, పంచా యతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, సర్పంచులు వైసీపీ నాయకులుశాఖల అధికారులు పాల్గొన్నారు.