Jul 22,2023 22:02

మహిళకు కరపత్రం అందజేస్తున్న విప్‌ కాపు రామచంద్రారెడ్డి

          ప్రజాశక్తి-గుమ్మఘట్ట   ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతోందని విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రంగసముద్రం గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమ్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు 610 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నయవంచన చేశారన్నారు. అదే జగన్‌ తన పాదయాత్రలో చేసిన హామీలను అధికారంలోకి వచ్చాక 98శాతం అమలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్‌పర్సన్‌ కాపు భారతి, ఎంపిపి భవాని, జడ్‌పిటిసి పిఎస్‌ మహేష్‌, వైస్‌ ఎంపిపి రామకృష్ణారెడ్డి, తహశీల్దార్‌ బ్రహ్మయ్య, జిల్లా గ్రీవెన్స్‌ అధ్యక్షులు గౌని కాంతారెడ్డి, కాంట్రాక్టర్‌ కొత్తపల్లి సత్యనారాయణరెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్‌ సుధాకర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బిటిపి గోవిందు, రాజమోహన్‌రెడ్డి, మంజునాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.