Oct 19,2023 19:24

మాట్లాడుతున్న వైసిపి నాయకులు

మాట్లాడుతున్న వైసిపి నాయకులు
సంగంలో జగనన్న సురక్ష
ప్రజాశక్తి-సంగం:స్థానిక జెడ్‌పి హైస్కూల్‌లో తహశీల్దార్‌ నాగరాజు, ఎంపిడిఒ గోపి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిభిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సురక్ష వైద్య శిబిరంలో వైద్య బందం ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను , వైద్యులు రోగులకు నిర్వహించే వైద్య పరీక్షలను వారు పరిశీలించారు. హెల్ప్‌ డెస్క్‌లను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలు గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరంలో రోగుల సమస్యలకు అనుగుణంగా ప్రత్యేక వైద్యులచే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో డాక్టర్‌ శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నాయకులు, ఇఒపిఆర్‌డి రమేష్‌ పాల్గొన్నారు.