Feb 27,2023 20:55

ప్రజాశక్తి - నరసాపురం
స్పందనలో వచ్చిన ఫిర్యాదులను ఛాలెంజ్‌గా తీసుకుని త్వరితగతిన అధికారులు పరిష్కరించి, ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని సబ్‌ కలెక్టర్‌ ఎం.సూర్యతేజ అన్నారు. సోమవారం నరసాపురం సబ్‌ కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన 53 ఫిర్యాదులను సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ స్వీకరించారు. ఈ సందర్బంగా సబ్‌ కలెక్టరు మాట్లాడుతూ అర్జీలు గడువులోగా పరిష్కరించే విధంగా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్పందనలో అందిన అర్జీలను రీఓపెన్‌ కాకుండా స్పష్టతతో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో భూ సమస్యలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌, మత్స్యశాఖ, వైద్య ఆరోగ్యశాఖ తదితర సమస్యపై ఫిర్యాదులు అందాయని తెలిపరు. కార్యక్రమంలో డివిజన్‌, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.