ప్రజాశక్తి-గుంతకల్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే నిరవదిక సమ్మె చేపడతామని సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కె.నరసయ్య, కార్యదర్శి ఎన్.రంగనాయకులు, సిఐటియూ జిల్లా కమిటీ సభ్యుడు దాసరి శ్రీనివాసులు,పట్టణ అధ్యక్షుడు కసాపురం రమేష్ హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు, మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. అలాగే సిపిఎస్ రద్దు చేయాలని, పదవీ విరమణ చేసిన కార్మికులను రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 15 తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. అనంతరం కమిషనర్ వి.మల్లికార్జునకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తిమ్మప్ప, రామునాయక్, కార్మిక సంఘం నాయకులు జగదీష్, సురేష్, ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ధర్నా చేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు










