ప్రజాశక్తి-గుంతకల్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సమరభేరిలో భాగంగా శనివారం పట్టణంలోని 26 సచివాలయాల్లో సిపిఎం నాయకులు ప్రజా సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అనేక భారాలు మోపు తున్నాయన్నారు. ప్రధానంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు పెట్టకుండా సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, రూ.400కే వంట గ్యాస్ ఇవ్వాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ ధరలను నియ ంత్రించాలని, ప్రజా పంపిణీ ద్వారా 12 రకాల సరుకులు సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న గ్రూప్ 1, 2 పోస్టులను భర్తీ చేయాలని, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, గిరిజన యువతకు స్పెషల్ డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వాలని, పట్టణాల్లో కూడా ఉపాధి పనులు పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వాలకు పతనం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.శ్రీనివాసులు, పట్టణ కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు, మారుతీప్రసాద్, సాకే నాగరాజు, కసాపురం రమేష్, జగ్గలి రమేష్, పట్టణ కమిటీ సభ్యులు తిమ్మ ప్ప, చంద్రశేఖర్, ఓబులేసు, రామునాయక్, చరణ్, వెంకీ, షాషా పాల్గొన్నారు.
అనంతపురం కలెక్టరేట్ : ధరల పెరుగుదలను నియంత్రించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలని సిపిఎం 1వ నగర కార్యదర్శి వి.రామిరెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా 1వ నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని 19 సచివాలయాల్లో అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బడా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి వేసిందని ఆరోపించారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజల ఆర్థికస్థితి దివాలా తీసే విధంగా తయారు చేసిందన్నారు. ఇంతటి భారాలు వేసి వచ్చిన ఆదాయంతో అభివృద్ధి ఏమైనా చేసిందా అంటే అదీ లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధరలను అదుపు చేయాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పించాలని, పట్టణాల్లో ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు కాలంలో పెద్దఎత్తున ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకురాలు వి.సావిత్రి, నగర నాయకులు రామిరెడ్డి, వలి, మసూదు, రాజీవ్‌కాలనీ ఎంపిటిసి రమీజాబీ, బాబు, బాలకృష్ణ, గపూర్, వెంకటేష్, లక్ష్మీనారాయణ, వరలక్ష్మి, రామాంజి, ఫక్రు, ఎస్‌కె.మహమ్మద్, డేవిడ్ వహీదా, మహేష్, ఉమేష్ చంద్రిక, ఫర్యాది, సునంద, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, ప్రజానాట్యమండలి నాయకులు శ్రీనివాసులు, పుల్లన్న, పాల్, అంజి, తదితరులు పాల్గొన్నారు.
గుత్తి : సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 12, 17, 18, 19వ వార్డుల సచివాలయాల్లో సిపిఎం ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు వి.నిర్మల, మండల నాయకురాలు ఎన్.రేణుక, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎస్.మున్నీ, రాజేశ్వరి, వెంకటలక్ష్మి, బాలమ్మ, పద్మావతి, అంజి, మారెన్న, తదితరులు పాల్గొన్నారు.
గుంతకల్లులో సచివాలయ అధికారిణికి వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు










