Jul 28,2023 21:42

ఆందోళన చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులు

           ప్రజాశక్తి-గుత్తి    తమ న్యాయమైన సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేంత వరకూ పోరాటాలు కొనసాగిస్తామని ఎపి రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల కార్యాచరణ సమితి డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కె.నాగేంద్రప్రసాద్‌ హెచ్చరించారు. విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఎపి రాష్ట్ర పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన శుక్రవారం రెండోరోజూ కొనసాగింది. ఇందులో భాగంగా భోజన విరామ సమయంలో నాయకులు, ఉద్యోగులు, కార్మికులు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కె.నాగేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ పే రీవిజన్‌ వెంటనే అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను తక్షణమే రెగ్యులర్‌ చేయాలన్నారు. ఇపిఎఫ్‌ టు జిపిఎఫ్‌ను అమలు చేయాలన్నారు. గ్రేడ్‌ 2 జేఎల్‌ఎం లను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అన్‌ లిమిటెడ్‌ మెడికల్‌ పాలిసీని అమలు చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనను విరమించేది లేదన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వి.రాజశేఖర్‌, డిఇ మేఘరాజ్‌, ఎఇలు ఎం.శ్రీకుమార్‌, కె.మధుసూదన్‌ రావు, జేఏసీ నాయకుడు శంషుద్దీన్‌, లైన్‌ ఇన్స్పెక్టర్లు ప్రహల్లాద, లక్షికాంతరెడ్డి, సీనియర్‌ లైన్‌ మాన్‌ లు కష్ణ, శ్రీనివాసులు, విశ్రాంత ఉద్యోగులు మహబూబ్‌ పీరా, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.