ప్రజాశక్తి - ఆచంట
విఒఎల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని కోరుతూ డ్వాక్రా యానిమేటర్లు బుధవారం స్థానిక నటరాజ్ వీధిలోని మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం సూపర్‌వైజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనకు సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విఒఎల ఉపాధిని దెబ్బతీసేలా ఉన్న కాల పరిమితి సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యానిమేటర్లకు ఉద్యోగ భధ్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఒఎల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మట్టపర్తి నాగమణి, నిమ్మన వెంకటతాయారు, సిహెచ్.వరలక్ష్మి, బివిఎల్.కుమారి, ఎస్.బేబీరాణి, ఎ.కనకమహాలక్ష్మి, బికె.కుమారి, కె.ఝాన్సీ, సిహెచ్.బేబీ స్వప్న, జి.లక్ష్మికుమారి, పివి.సురేఖ, ఎంవి.లక్ష్మి పాల్గొన్నారు.
తణుకురూరల్: విఒఎల తొలగింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విఒఎల సంఘం జిల్లా కార్యదర్శి అడ్డగర్ల అజయకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెలుగు విఒఎల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్ధానిక డ్వాక్రా వెలుగు మండల కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించి, అనంతరం ఎపిఎం రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అజయకుమారి మాట్లాడుతూ వెలుగు విఒఎలు 25 సంవత్సరాల నుండి పని చేస్తున్నారన్నారు. ఇప్పుడు వారిని ఉద్యోగాల నుండి తొలగించి, వాలంటీర్లకు బాధ్యత అప్పగిస్తామనడం అన్యాయమన్నారు. ఎన్నికల ముందు మాత్రం హెచ్‌ఆర్ పాలసీ అమలు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, రూ.10వేలు వేతనం ఇస్తామని చెప్పిన సిఎం జగన్ ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కాలపరిమితి సర్క్యూలర్ రద్దు చేసి, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, విఒఎల తొలగింపు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతి, సుబ్బలక్ష్మీ, రమాదేవి, భాగ్యలక్ష్మీ, వెంకటలక్ష్మీ, వరలక్ష్మీ, జ్యోతి పాల్గొన్నారు.










