సమస్యలు గుర్తించిన వెంటనే పరిష్కరించాలి
మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాష
ప్రజాశక్తి- పుంగనూరు: మున్సిపాలిటీలో ఉన్న వార్డుల్లో సమస్యలను గుర్తించిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాష అన్నారు. పట్టణంలోని మూడోవార్డులో కౌన్సిలర్ మమత, వైసిపి నాయకులు లక్ష్మణరాజు ఆధ్వర్యంలో వార్డులో గురువారం పర్యటించడం జరిగింది. వార్డులో కొన్ని ప్రాంతాల్లో చెత్తను సరిగా తొలగించకపోవడంతో శానిటరీ ఇన్స్పెక్టర్‌కు చూపిస్తూ వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డుల్లో ఎలాంటి చిన్న సమస్యలున్న సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. వీటన్నింటిని దష్టిలో ఉంచుకొని సిబ్బంది నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు స్టేట్ అండ్ ఫోక్ క్రియేటివిటీ చైర్మన్ కొండవీటి నాగభూషణం సూచనలతో, మూడవ వార్డులోని శాంతినగర్, సూర్యనగర్, పరిసర ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు గుర్తించామన్నారు. పట్టణప్రజలకు మెరుగైనసేవలు అందించేందుకు అందరు కషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నసింహప్రసాద్, సచివాలయ, మున్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు.










