సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: సోమవారం ఉదయం ప్రతి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, డిఆర్‌ఓ రాజశేఖర్‌లతో కలసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 137 అర్జీలు రాగా, ఇందులో రెవెన్యూశాఖకు సంబంధించి 103, డిఎస్‌ఒకు సంబంధించి 2, మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి 4, హౌసింగ్‌కు సంబంధించి 5, సంక్షేమశాఖలకు సంబంధించి 4, పోలీసుశాఖలకు సంబంధించి 2, ఇతర శాఖలకు సంబంధించిన 17, అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్, జేసి, డిఆర్‌ఓకు అందజేశారు. రాష్ట్రప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు తీసుకొని పరిష్కరించాల్సిందిగా జెసి, జిల్లా అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.










