అర్జీలను పరిశీలిస్తున్న డిప్యూటీ కమిషనర్
సమస్యలను పరిష్కరించేలా చేయాలి
డిప్యూటీ కమిషనర్ చెన్నుడు
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:స్పందన కార్యక్రమంలో స్వీకరించిన వినతులను క్షుణ్ణంగా విచారించి ప్రజల సమస్యలకు దారి చూపి నాణ్యమైన పరిష్కారాలు అందించి ఫిర్యాదులు పునరావతం కాకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు పేర్కొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం సమావేశం మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలకు పారదర్శకమైన పరిష్కారాన్ని సూచించిన గడువులోపు అందించేందుకు అన్ని శాఖల అధికారులు కషి చేయాలన్నారు. స్పందన సమస్యలు పునరావతం కాకుండా అధికారులంతా పరిష్కార మార్గం చూపాలన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.










