Aug 01,2022 21:44

సమస్యలకు పరిష్కార వేదికగా 'స్పందన' :ఎస్పీ
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి అని జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ 30 ఫిర్యాదులను ఫిర్యాదుదారుల నుంచి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. సోమవారం జిల్లా ఏఆర్‌ పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి 25ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా జిల్లా ఎస్పీకి సమస్యలను విన్నవించుకున్నారు. ఈఫిర్యాదులకు స్పందిస్తూ ఎస్పి, అడిషనల్‌ ఎస్‌పి బాధితుల ఎదుటే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యను పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్‌ క్రైమ్‌ 1, చీటింగ్‌ 1, వేధింపులు 2, ఆస్తి తగాదాలు 21, ఫోర్జరీ 2, కుటుంబ తగాదాలు-3 ఉన్నాయని తెలిపారు. ఈకార్యక్రమంలో డిఎస్పీ ఎన్‌. సుధాకర్‌రెడ్డి, ఆర్‌ఐ ఎంటిఓ మధు, ఎస్‌ఐ మాధవ పాల్గొన్నారు.