సమస్యలకు పరిష్కార వేదిక 'స్పందన'
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జిల్లా ఎస్‌పి రిషాంత్‌రెడ్డి సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకూడదని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్‌పి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జగదీష్‌ని కలసిి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరితగతిన విచారణ జరిపి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 23 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.










