సమస్యల స్టేషన్..
అంతంత మాత్రంగా సౌకర్యాలు
అవస్థలు పడుతున్న ప్రయాణికులు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పేరుకే మోడల్ రైల్వేస్టేషన్ ఇక్కడ అన్ని సమస్యలే. చిత్తూరు రైల్వేస్టేషన్లు ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కనీస వసతులైన తాగునీరు, మరుగుదొడ్ల వంటి వసతుల పరిస్థితి అంతమాత్రమే దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. చిత్తూరు రైల్వేస్టేషన్లో ప్రధానంగా మూడు ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం మాత్రమే పూర్తిస్థాయిలో పైకప్పు రేకులు ఉండగా రెండో, మూడు ప్లాట్‌ఫామ్స్ పూర్తిస్థాయిలో పైకప్పు లేకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రైలు ఎక్కేందుకు వచ్చే ప్రయాణీకులు రైలు వచ్చే వరకు వేచి ఉండాల్సిన దుస్థితి.
రైల్వేస్టేషన్ ఆదాయం బాగా పెరిగిన ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో రైల్వేశాఖ దష్టి పెట్టడం లేదు. ప్రతిరోజు చిత్తూరు రైల్వేస్టేషన్ నుంచి వందలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. అయితే ఇక్కడి సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండటంతోపాటు రైల్వేస్టేషన్లో విభాగాల్లో సిబ్బంది కొరత సైతం ఉంది.
ఆగని ఎక్స్ప్రెస్ రైలు
ప్రతిరోజు చిత్తూరు రైల్వేస్టేషన్ మీదుగా అనేక రైతుల వెళ్ళుతున్నా చిత్తూరు స్టేషన్‌లో మాత్రం ఆగే పరిస్థితి లేదు. మోడ్రన్ రైల్వే స్టేషన్ అధునీకరిస్తాం, అభివృద్ధి మాత్రం శూన్యమనే చెప్పాలి. నిధులు కేటాయింపుల లేకపోవడం ఓ కారణంగా తెలుస్తోంది. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైలు ఆపాలని స్థానికులు కోరుతున్నారు. చిత్తూరులో పర్యటించిన రైల్వే సహాయ మంత్రులు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు చెన్నై ఎక్స్ప్రెస్ రైలు చిత్తూరు వరకు పొడిగించాలని విన్నతులు ఇచ్చినా ఫలితం లేదు. 10 సంవత్సరాల క్రితం కాట్పాడికి తిరుపతి మధ్య డబుల్ లైన్ పనులు ప్రారంభించారని అప్పటి పాలకవర్గం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దక్షిణ మధ్య రైల్వే నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిసింది. అయితే పాలకుల నిర్లక్ష్యంగా కారణంగా కాట్పాడి నుండి తిరుపతి డబుల్ లైన్ పనులు వ్యవహారం అటకెక్కినట్లు తెలుస్తోంది. డబుల్‌లైన్ పనులు జరిగితే అనేక రైళ్లు ఈమార్గం గుండా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి చిత్తూరు నగరంలోని రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.










