సమస్యల పరిష్కారంలో కమిషనర్ బేష్
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషనరు వెంకటేష్ సంబం ధిత అధికార్లతో చర్చించి సమస్యలు పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారని మున్సిపల్ వర్కర్ యూనియన్, ఎఐటియు నాయకులు తెలిపారు. ఈ మేరకు కమిషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ము న్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోపీనాథ్, మణి, యూని యన్ నాయకులు దొరస్వామి, వాసు, జయశంకర్, సురేష్, వినా యక, సుగుణ, శోభన్ బాబు, సుభాషిని, సుకన్య, చిత్ర, ఈశ్వరన్, వెంకట్రావు జాయింట్ మీటింగ్‌లో పాల్గొని మున్సిపల్ పారిశుధ్య కా ర్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.
పారిశుధ్య కార్మికుల సమస్యలను కమిషనర్‌తో చర్చిస్తున్న యూనియన్ నాయకులు










