
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - టెక్కలి రూరల్: 'జగనన్నకు చెబుదాం'లో వచ్చిన సమస్యలకు పరిష్కారం దిశగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమానికి భూ సమస్యలు, ఇళ్ల పట్టాలు, తాగునీరు, సిసి రోడ్లు తదితర సమస్యలపై 77 వినతులు వచ్చాయి. కలెక్టర్ వినతిపత్రాలను స్వీకరించి, ప్రతి సమస్యపై సంబంధిత అధికారుల వివరణలు కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్, ఎస్‌పి జి.ఆర్ రాధిక, టెక్కలి ఇన్‌ఛార్జి ఆర్‌డిఒ సీతారామ్మూర్తి, డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు, హౌసింగ్ పీడీ ఎన్.గణపతిరావు, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, డిపిఒ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.