సమస్యల పరిష్కారానికి ఎస్‌డబ్ల్యుఎఫ్ నిరసన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు ఆర్‌టిసి డిపోలో సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డిపో మేనేజర్ కరిమున్నీషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆత్మకూరు డిపో నుండి ఉదయగిరికి రిలీవ్ చేసిన డ్రైవర్లను తిరిగి ఆత్మకూరు డిపోకు రప్పించి లీవ్ పోసిబెన్ మెరుగుపరచాలన్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. డ్రైవర్లపై కెఎంపిఎల్ వేధింపులు మానుకోవాలన్నారు. క్యాష్ కౌంటర్‌లో రూఫ్ సీలింగ్ మరమ్మతులు చేయించాలని, నగదు పెట్టుకునే సౌకర్యవంతమైన క్యాష్ టేబుల్‌ను సమకూర్చాలన్నారు. పిడిటి ఉద్యోగలను నష్టం కలిగించే జిఒ నెంబర్ 70, 71లను రద్దు చేసి 1/2019 సర్య్కూలర్‌ను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అన్ని రూటల్లలో రోడ్డు కండీషన్, ట్రాఫిక్ కండిషన్ ఆధారంగా రూట్ సర్వే జరిపి రన్నింగ్ టైం నిర్ణయించాలని, అవసరం ఉన్న మహిళా కండక్టర్లకు చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలన్నారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఆర్థికపరమైన బకాయిలను త్వరగా చెల్లించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిపో కార్యదర్శి ఎన్.భాస్కర్, అధ్యక్షుడు పి.పెంచలరావు, కోశాధికారి ఎం.చెన్నయ్య, ప్రచార కార్యదర్శి షేక్ మహ్మదాలీ, రీజనల్ బాధ్యులు యు.నరసింహులు, డి.తాతారావు, షేక్ ఖాజారంతుల్లా, వెంగళరావు, ఎన్.హజరత్తయ్య, ఇ.సుందరయ్య, ఎన్ ఎస్ రెడ్డి, కె దిలీప్‌కుమార్, ఎఎస్ వాసులు, షేక్ షబ్బీర్, కె.రవీంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










