మున్సిపల్ కార్యలయంలో వినతిపత్రం అందజేస్తున్న ముస్లిములు
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు కోటకట్ట ప్రాంతంలో ఉన్న ముస్లిముల శ్మశాన వాటికలో పిచ్చి మొక్కలు పెరిగి అంత్యక్రియలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందిగా ఉందని, అక్కడ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శ్మశాన వాటికను శుభ్రపరచాలని కందుకూరు ఎంపిడిఒ బాధ్యులు ముస్తఫా, నసీర్, సందానీలు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు.










