ఎమ్మెల్యే చొరవతో తీరనున్న వందేళ్ల కల
ప్రజాశక్తి - ఏర్పేడు: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పేడు మండలం ఇన్‌చార్జ్ గున్నేరి కిషోర్ కుమార్ రెడ్డి సూచనలతో సర్పంచ్ మోహన ప్రియ ఆధ్వర్యంలో మంగళవారం శ్మశానం కోసం స్థలపరిశీలన చేశారు. వందలాది సంవత్సరాలుగా ఎండి పుత్తూరు గ్రామానికి శ్మశానం లేక గ్రామస్తులు ఎన్నో ఇబ్భందులు ఎదుర్కొంట ున్నారు. శ్మశానం విషయమై సర్పంచ్‌కి తెలియజేయగా వెంటనే స్పందించి శాసనసభ్యుల వారికి తెలియపరిచి వారి సహకారంతో మండల సర్వేయర్ ద్వారా శ్మశాన స్థలానికై సర్వే నిర్వహించి స్థలం కేటాయింపుచేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే మధుసూదన రెడ్డికి మండల ఇన్‌చార్జి గున్నేరి కిషోర్ కుమార్ రెడ్డికి, సర్పంచ్ మోహన ప్రియకు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వైసిపి ఉపాధ్యక్షులు సుబ్రమణ్యం యాదవ్, కేశవులు యాదవ్, రమేష్ యాదవ్, మునెయ్య యాదవ్, దిలీప్ యాదవ్, అమీద్ భాషా, వాసు యాదవ్, సుభాకర్ రెడ్డి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.










