Dec 01,2022 22:34

వైఎస్‌ఆర్‌ పెన్షన్స్‌ అందజేస్తున్న నగర కమిషన్‌ అరుణ

సమర్థవంతంగా సంక్షేమ పథకాల అమలు : కమిషనర్‌
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌ :
క్షేత్రస్థాయిలో వార్డు వాలంటీర్లు, వార్డు కార్యదర్శులు సమన్వయంతో సమర్థవంతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె అరుణ చెప్పారు. గురువారం ఉదయం కమిషనర్‌ డా. జె అరుణ నగరపాలక సంస్థ పరిధిలో 41వ వార్డు తోటపాళ్యం పరిధిలో నీవానది వీధి, బాణాల వీధిలో పర్యటించారు. డిసెంబర్‌ 1వ తేదీ కావడంతో స్థానికంగా జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు పెన్షన్‌ నగదు ను అందించడంతో పాటు వారితో మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఉదయం ఏడు గంటలకే స్థానికంగా 70 శాతం పింఛన్ల పంపిణీ చేయ డంపై సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎస్‌.డి.జీ(సుస్థిరాభివద్ధి లక్ష్యాలు) సర్వేపై క్షేత్రస్థాయిలో పరి శీలించారు. ఐదేళ్లలోపు పిల్లలు, 14 ఏళ్లలోపు పిల్లలు, డ్రాపౌట్స్‌, మహిళలు, గర్భవతులు తదితర అంశాలపై క్లస్టర్‌ స్థాయిలో వాలంటీర్లు చేపడుతున్న సర్వేను పరి శీలించారు. నిర్దేశించిన సమయం లోగా సర్వే పూర్తి చేయాలన్నారు. అనంతరం ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీని తనిఖీ చేశారు. కార్యక్రమంలో మెప్మా సీఎంఎం గోపి, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.