Jul 26,2022 21:56

సమిష్టి కృషితో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలి
జిల్లా కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జిల్లాలోని సంబంధితశాఖల అధికారులందరూ కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్‌ సుస్థిర అభివద్ధి లక్ష్యాల సాధనకు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, సిఎస్‌ తరచూ సుస్థిర అభివద్ధి లక్ష్యాల సాధనపై సమీక్ష నిర్వహించడం జరుగుతోందన్నారు. కావున జిల్లాస్థాయి అధికారులందరూ ఈఅంశం ప్రాధాన్యతను గుర్తించి శాఖలవారీగా చేపట్టవలసిన అంశాలపై దష్టి సారించారని తెలిపారు. విద్యా,వైద్య రంగాలకు సంబంధించి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతున్నదని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారని సూచించారు. ఈసమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ, సిపిఓ ఉమాదేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకష్ణ, డిఈఓ పురుషోత్తం, డిఎస్‌ఓ శంకరన్‌, ఎల్‌డిఎం శేషగిరిరావు, ఐసిడి ఎస్‌ పిడి నాగ శైలజ, ట్రాన్స్కోకో ఈఈ హరి, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.