Sep 20,2023 22:26

సమావేశంలో మాట్లాడుతున్న మురళి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వనరులు సమకూర్చేందుకు పంచాయతీ కార్యదర్శులు ఇతర శాఖల సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ జె.మురళి అన్నారు. ప్రణాళికాబద్ధంగా సమిష్టి కృషితో మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు. నగరంలోని జెడ్‌పి సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులకు వృత్తి శిక్షణా తరగతులను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిపాలనలో కార్యదర్శుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. శిక్షణ ద్వారా నేర్చుకున్న మెళకువలను, నియమ నిబంధనలను ఉపయోగించుకుని పంచాయతీలను అభివృద్ధిపథంలో నడిపించాలని తెలిపారు. ఆదాయ వనరులను సృష్టించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సక్రమంగా అందించడంలో నిర్లక్ష్యం లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అర్హులైన ఏఒక్క కుటుంబాన్నీ విస్మరించవద్దని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇ.కృష్ణమోహన్‌, హార్ట్‌ఫుల్‌ సంస్థ ప్రతినిధి లక్ష్మణరావు డిఎల్‌పిఒ గోపిబాల, ఐ.వి రమణ, పి.వి రాజు, ఎస్‌.లోకనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.