May 23,2023 22:09

ఏపీ ఈఏపీసెట్‌-23 ఛైర్మన్‌ రంగజనార్ధన

          అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు, ఎపి.ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌ సమిష్టి కషితో విజయవంతంగా మంగళవారం నాటితో ముగిసిందని ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ రంగజనార్ధన, కన్వీనర్‌ శోభాబిందు తెలిపారు. పరీక్షల నిర్వహిణకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు తొమ్మిది సెషన్స్‌లో పరీక్షలు జరిగాయన్నారు. ఇందులో ఇంజినీరింగ్‌(ఎంపీసీ) విభాగం పరీక్షలకు 2,24,724 మంది, ఈనెల 22నుంచి 23 వరకు నాలుగు సెషన్స్‌ లో జరిగిన అగ్రికల్చర్‌, ఫార్మసీ, నర్సింగ్‌(బైపీసీ) ప్రవేశ పరీక్షలకు 90,573 మంది హాజరు అయినట్లు తెలిపారు. 23 రాత్రి ఎనిమిది గంటలకు ఇంజినీరింగ్‌ పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ, నర్సింగ్‌ ప్రవేశ పరీక్షల ప్రాథమిక కీని 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. ఆంధ్ర,తెలంగాణలో కలిపి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ పరీక్షలకు 3,38,738 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 3,15,297 మంది హాజరు అయ్యారని తెలిపారు. 93.38 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. ఈఏపీసెట్‌-23 పరీక్షలు విజయవంతం కావడంలో ఉద్యోగుల అందరి సమిష్టి కషి ఉందన్నారు.