Oct 26,2023 22:43

కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి- కవిటి: ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర వచ్చేవరకు తమ పంటలను నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీపై నిర్మిస్తున్న సమీకృత సేకరణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎపి ఎంఐపి పీడీ ఆర్‌.శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్‌.వి.వి. ప్రసాదరావు సూచించారు. మండలంలోని ముత్యాలపేట, చండిపుట్టుగ, కవిటి గ్రామాల్లో నిర్మిస్తున్న సమీకృత సేకరణ కేంద్రాలను గురువారం పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడి ఈ కేంద్రాల వినియోగం, వాటి ఉపయోగాలు వివరించారు. రూ.15 లక్షల విలువైన ఈ కేంద్రాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 75 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ఉద్యానశాఖ అధికారి పోలాకి మాధవి, హెచ్‌ఇఒ టి.బాలరాజు, ఎంఐఇ బి.హరిప్రసాద్‌, ఎంపిఇఒలు ఎం.లలిత, వై.విష్ణు, రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.