స్మార్ట్ డివి ఐటీ పార్కు నిర్మాణ పనుల పరిశీలన
ప్రజాశక్తి- ఎస్‌ఆర్‌పురం
ఎస్‌ఆర్‌పురం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ కొటార్లపల్లి గ్రామం వద్ద నిర్మస్తున్న స్మార్ట్ డివి ఐటీ పార్కు పనులను డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌చైర్మన్ విజయానందరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న స్మార్ట్ డివి పరిశ్రమ పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ పరిశ్రమ పూర్తి అయితే నియోజకవర్గంలో ఉన్న 3000 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. త్వరలోనే మరిన్ని పరిశ్రమలు జిల్లాకు రానున్నాయని, పరిశ్రమలు స్థాపించుటకు ప్రభుత్వం రాయితులు ఇవ్వడం జరుగుతుందని ఈఅవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి రమణ ప్రసాద్‌రెడ్డి, డిసిసి బ్యాంక్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి, మాజీ సర్పంచ్ విజయబాబు, డిసెంబర్ శెట్టి, యుగంధర్ పాల్గొన్నారు.










