ప్రజాశక్తి-అనంతపురం సమానత్వమే బాబూజీ కలలుగన్న స్వరాజ్యమని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరేపల్లి శ్రీదేవి అన్నారు. బుధవారం మెడికల్ కళాశాలలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రిన్సిపల్ శ్రీదేవి మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి, అంటరానితనాన్ని నిర్మూలించడానికి, అస్పృశ్యతను పోగొట్టడానికి, సమాజంలో అందరూ సమానత్వంతో బతకడానికి బాబూజీ పోరాడారన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ శంకర్, సహాచార్యులు డాక్టర్ శైలజ, డాక్టర్ శారద, డాక్టర్ రవితేజ, డాక్టర్ భాస్కర్ బాబు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, ఆఫీస్ సూపరింటెండెంట్ రవికుమార్, సహాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
కెవిపిఎస్ ఆధ్వర్యంలో..
కెఎస్‌ఆర్ కళాశాల ఎదుట ఉన్న జగ్జీవన్‌రామ్ విగ్రహానికి కెవిపిఎస్ నాయకులు పూల మాలలువేసి నివాళులు అర్పించారు. కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షలు ఓ.నల్లప్ప హాజరై మాట్లాడుతూ దళిత నాయకుడిగా, సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన కషి గొప్పదన్నారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో దళిత, గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కెవిపిఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు అక్కులప్ప, వెంకటేష్, నాయకులు నరసింహ, నాగేంద్ర, గోపి, శేఖర్, రమేష్ బాబు, శివ పాల్గొన్నారు.
యుటిఎఫ్ ఆధ్వర్యంలో..
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కెఎస్‌ఆర్ కళాశాల ఎదురుగా ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.కోటేశ్వరప్ప, యుటిఎఫ్ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి కె.నాగేంద్ర, యుటిఎఫ్ అనంతపురం జిల్లా గౌరవ అధ్యక్షులు రమణయ్య, జిల్లా అధ్యక్షులు లింగమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, ఆడిట్ కన్వీనర్ సుబ్బరాయుడు, గంగాధర, శేషప్ప, పవన్ పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో..
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ ఎల్‌ఎం.ఉమా మోహన్‌రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.రమా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్‌ఎం.మోహన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
గుత్తి : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఉప తహశీల్దారు శ్రీలత జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీఆర్వోలు బాలరాజు, అబూబకర్, వీఆర్‌ఏలు పాల్గొన్నారు. పట్టణంలోని గాంధీ కూడలిలో జగ్జీవన్‌రామ్ జయంతిని ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంజన ప్రసాద్, గౌరవాధ్యక్షులు రామదాసు, ఎన్.ఈరన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కెవిపిఎస్ మండల కార్యదర్శి యు.మల్లికార్జున, బీఎస్పీ నాయకులు బండల రామాంజినేయులు, భీమలింగ శ్రీధర్ గౌడ్, హమాలీ నాగేంద్ర, నాగేష్, టీచర్ నాగరాజు, గుత్తి కోట గైడ్ రమేష్, అబ్బేదొడ్డి లాలెప్ప, ఓబులేసు, కొజ్జేపల్లి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండ : స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో భాస్కర్, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సాకే భాస్కర్, దళిత గిరిజన హక్కుల సాధన సమితి అధ్యక్షులు గోపాల్, ఉద్యోగ, ఉపాధ్యాయ, దళిత సంఘాల నేతలు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచాయతీ ఉద్యోగి గోపాల్ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జీవిత చరిత్ర బుక్‌లెట్లను అందజేశారు. కార్యక్రమంలో దళితుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తిప్పేస్వామి, ఎస్సీ, ఎస్టీ ప్రజా సమస్యల జిల్లా అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్, దళిత ఉద్యోగ సంఘాలు నేతలు కృష్ణ, వన్నప్ప, మల్లెల వేణు ప్రసాద్, లక్ష్మన్న, వైసిపి నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.










