సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
ప్రజాశక్తి - పాలకొల్లు
సమాజంలో విలువలు రోజురోజుకూ దారుణంగా పడిపోతున్నాయని లయన్స్ క్లబ్ వంటి సేవా సంస్థలు సమాజ సేవతో పాటు విలువలు పెంచేందుకు కృషి చేయాలని సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కోరారు. పాలకొల్లులో జరిగిన లయన్స్ క్లబ్ ప్రాంతీయ సమావేశంలో ఆదివారం ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. క్షీరారామంలో అనేక కార్యక్రమాల్లో తాను పాల్గొన్నానని, ఎప్పుడూ ఆనందంగా పాల్గొంటానని చెప్పారు. మంచి సమాజానికి అందరూ కృషి చేయాలని కోరారు. తన జీవిత అనుభవాలను గాయాలతో మార్పిడి చేసి గానం చేశారు. కుటుంబ బంధాలు, భార్యా భర్తల పాత్రలపై హాస్య గాయాలతో నవ్వులు పూయించారు. అనంతరం ఆయనను లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ బాబ్జీ, ప్రాంతీయ ఛైర్మన్ కారుమూరి రామలింగేశ్వరరావు దంపతులు, తణుకు మున్సిపల్ మాజీ ఛైర్మన్ వంకా రాజకుమారి, జోనల్ ఛైర్మన్ పాపారావు నాయుడు, లైన్స్ క్లబ్ అధ్యక్షులు ముచ్చర్ల సత్యనారాయణ పాల్గొన్నారు.










