ప్రజాశక్తి - పాలకోడేరు
గ్రామీణ ప్రజలతో విద్యార్థులు మమేకమై వారి సమస్యలను అధ్యయనం చేస్తే సమాజాుకి ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులు చేయొచ్చని భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.జగపతిరాజు అన్నారు. ఎస్‌ఆర్‌కెఆర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు మోగల్లులో ప్రత్యేక సేవా శిబిరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక సేవా శిబిర్నాు ప్రారంభించారు. ఈ కార్యక్రమాుకి ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆర్.కృష్ణచైతన్య అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్స్రిుపల్ జగపతిరాజు మాట్లాడుతూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, ప్రముఖ శాస్త్రవేత్త ఎఎస్ రావు జన్మించిన మోగల్లుకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ సందర్భంగా సర్పంచి ఎం.కృష్ణకుమార్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్‌వి.రంగరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జివివి శ్రీువాస్, మాజీ ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరశర్మ, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్స్ కెఎస్‌ఎస్.ప్రసాదరాజు, కెఎన్‌వి.సత్యనారాయణ పాల్గొన్నారు.










