స్కిల్ హబ్ ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ యం.హరి నారాయణన్
చిత్తూరు అర్బన్: విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'స్కిల్ హబ్' ఏర్పాటుకు చర్యలు చేపడుతోందని కలెక్టర్ యం.హరి నారాయణన్ తెలిపారు. బుధవారం కలెక్టర్ చిత్తూరు ఐటిఐ కాలేజీలో స్కిల్ హబ్ ఏర్పాట్లలో భాగంగా మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. కేంద్రాన్ని ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఐటిఐ కళాశాల పరి శీలనలో జిల్లా కలెక్ట ర్ వెంట డిఆర్డిఏ పిడి తులసి, ఐటిఐ కాలే జీ ప్రిన్సిపాల్ రవీం ద్రారెడ్డి ఉన్నారు. విద్యార్థులకు మరింత రుచికరంగా మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు.










