అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్
అనంతపురం కలెక్టరేట్ : పామిడి మండల కేంద్రంలోని గుప్తా కాలనీలో రూ.1.09కోట్ల వ్యయంతో, నెహ్రూ కాలనీలో రూ.2.02 కోట్ల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రెయినేజీలు, వికె ఆదినారాయణ రెడ్డి కాలనీలో రూ.52 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను కలెక్టర్ ఎం.గౌతమి, గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డిలు బుధవారం ప్రారంభించారు. పామిడిలో రోడ్డు పక్కన చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతుకు ముందు కలెక్టర్ పామిడిలో రూ.5.8 కోట్లతో నాడు-నేడు కింద నిర్మిస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ లిఖిత, ఆర్డీవో రవీంద్ర, ఎంపీడీవో డి.ప్రభాకర్, పామిడి తహశీల్దార్ సునీత, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యల్లప్ప పాల్గొన్నారు










