సిపిఎస్‌ను రద్దు చేయాలి
పాతపెన్షన్ విధానాన్ని కొనసాగించాలి
కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాల ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యకార్యచరణ సమితి నేతత్వంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా జేఏసీ నాయకులు ఎన్జీవో జిల్లా అధ్యక్షులు రాఘవులు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ తలపెట్టిన మిలియన్ మార్చ్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేంత వరకు జేఏసీ నేతత్వంలో ఉద్యమానులను ఉదతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్జీవోస్ అసోసియేషన్ కార్యదర్శి రఘు, డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పన్నీర్ సెల్వం, ఉద్యోగఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పుంగనూరు: సిపిఎస్ రద్దు కోసం యుటిఎఫ్ పుంగనూరు సంఘనాయకులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు యుటిఎఫ్ పుంగనూరు శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు జగన్మోహన్‌రెడ్డి, శంకర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రెడ్డప్పలు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయాలని ఓపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ నాయకులు మోకాళ్ళ మీద నిలబడి కొవ్వొత్తులతో నల్ల బ్యాడ్జీలను ధరించి తమ నిరసన తెలుపడం జరిగింది. కార్యక్రమంలో ఆంజప్ప, సురేందర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, లోకనాథ్ సుధాకర్‌రెడ్డి, రామయ్య, రవీంద్రయ్య పాల్గొన్నారు.
వెదురుకుప్పం: సిపిఎస్ విధానాన్ని రద్దుచేయాలని రాష్ట్ర సంఘం పిలుపుమేరకు గురువారం మండల వనరుల విద్యాకేంద్రం దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల యూటీఎఫ్ అధ్యక్షులు దేశయ్య ఆధ్వర్యంలో జరిగింది. ప్రభుత్వ నిర్బంధాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగింది. కార్యక్రమంలో పీతాంబరం రెడ్డి, శ్రీనివాసులు, లోకనాథం, కల్పన, శంకర్ సుభాషిని, కామరాజు, కవిత, ఆనందరావు పురుషోత్తం, సిద్ధిలక్ష్మి, లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.










