ప్రజాశక్తి - తిరుపతి టౌన్
రాష్ట్ర పిలుపు మేరకు రేణిగుంట మండల విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా సిపిఎస్ రద్దు కోసం నిరసన జరిగింది. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోలేదని, దీనివల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. బాబురెడ్డి మాట్లాడుతూ గురువారం నుంచి మూడు రోజుల పాటు మండలస్థాయిలో నిరసన ప్రదర్శనలు, 20న జిల్లాస్థాయిలో భారీఎత్తున ర్యాలీ, ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. నెలాఖరులోపు రోడ్‌మ్యాప్ ఇవ్వని పక్షంలో ఏప్రిల్ 3వ తేదీన తిరుపతిలో వేలాదిమందితో భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్ నాయుడు, జిల్లా అధ్యక్షులు ముత్యాలరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ దేవరాల నిర్మల, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, హరినాధ్ పాల్గొన్నారు.










