Mar 20,2022 23:03

ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ, యుటిఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు


ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌
ఆదివారం చిత్తూరు డిఈఓ కార్యాలయం ఎదుట యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్‌పై మండలిలో సైతం వాయిదా తీర్మాణంను ఇస్తున్నామని, ప్రభుత్వంలో కదలిక తేవడానికి జిల్లాస్థాయి పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.రఘుపతి రెడ్డి మాట్లాడుతూ 2004 నుంచి సిపిఎస్‌ను రద్దు చేయాలని అనేక పోరాటాలు చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం దారుణమన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వెంటనే సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షకార్యదర్శులు కె.ముత్యాలరెడ్డి, జివి.రమణ, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యులు కె.సదాశివరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు టి.సుధాకర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.