ఫొటో : పోలీస్‌స్టేషన్ ఎదుట సిపిఎం నాయకులు
సిపిఎం నేతలపై అక్రమ కేసులు
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : మండలంలోని పెనుబల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘర్షణలో సిపిఎం నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. శుక్రవారం గ్రామంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో సిపిఎం వైసిపి నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం పోలీసులు సిపిఎం నాయకులపై అక్రమ కేసులను బనాయించారు. సిపిఎం నాయకులపై 307 కేసు నమోదు చేయగా, వైసిపి నాయకులపై 324 కేసు నమోదు చేశారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి సిపిఎం నాయకులపై అక్రమ కేసులు బనాయించారని సిపిఎం పార్టీ నాయకులు ఖండించారు. ఈ విషయంపై నెల్లూరు రూరల్ డిఎస్‌పిని కలిసి ఫిర్యాదు చేశారు.










