ప్రజాశక్తి - పాలకొల్లు
సిపిఎం సీనియర్ నాయకులు కేతా సూర్యారావు కుమార్తె చింతపల్లి విజయలక్ష్మి (62) పాలకొల్లులోని హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం ఉదయం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కవురు పెద్దిరాజు, సీనియర్ నాయకులు వలవల శ్రీరామ్మూర్తి, జవ్వాది శ్రీనివాస్, సిపిఎం యలమంచిలి మండల కార్యదర్శి కానేటి బాలరాజు విజయలక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి వెంట ఐద్వా నాయకులు పి.ప్రశాంతి, సిహెచ్ సత్యనారాయణమ్మ, ఎస్.నాగమణి, ఎం.జయశ్రీ, పి.సుభద్ర, నాయకులు ఎం.ఆంజనేయులు, జి.సత్యనారాయణ, టి.స్టాలిన్, ఎం జైసింఫ్‌ు, ఎం.రాజేష్, పి.వెంకటస్వామి, నాని, ఎం.చిట్టి ఉన్నారు.










