Apr 24,2022 15:55

నగరి: భార్యా వియోగంతో  బాధపడుతున్న సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణను  ఆయన స్వగృహంలో పలువురు  పరామర్శించారు. డ్రగ్స్‌ దిగ్గజం, కరోనా వైరస్‌ నివారిణి కోవాక్సిన్‌ మందుల తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ అధినేత డాక్టర్‌.కృష్ణ ఎల్లా,అతని సతీమణి భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ సుచిత్ర ఎల్లా నగరి మండలం,అయణంబాకంలోని నారాయణ స్వగృహంలో ఆయన సతీమణి వసుమతి దేవి వియోగంతో బాధపడుతున్న సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణను పరామర్శించారు.