Oct 24,2023 18:56

సినిమా టైటిల్‌ను ఆవిష్కరిస్తున్న మలినేని లక్ష్మయ్య

ప్రజాశక్తి-కందుకూరు :శ్రీ కళాధర ప్రొడక్షన్స్‌ 46 సినిమా బ్యానర్‌లో తీయబోతున్న నూతన సినిమా టైటిల్‌ను మలినేని లక్ష్మయ్య చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించాచరు. టైటిల్‌ 'రామంతపురం ప్రెసిడెంట్‌ అల్లుడు' అనేది చాలా అద్భుతంగా ఉందని మలినేని లక్ష్మయ్య మాట్లాడుతూ కొనియాడారు. ఈ సినిమాలో తను కూడా నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్ర నిర్మాత తోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విజయదశమి రోజు మా సినిమా టైటిల్‌ను లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జస్టిస్‌ డైరెక్టర్‌ సల్మాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్టు నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కో-డైరెక్టర్‌ గా రాజు , మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సల్మాన్‌ ఖాన్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సిఎం చౌదరి, శిరోమణి, ఇస్సాక్‌, రవికుమార్‌, , మౌనేష్‌ ,సాజిద్‌ ,సిద్దయ్య ,వంశీ ,బాజి , రమణి దాస్‌, మధురమని కార్యక్రమలో పాల్గొన్నారు. డైరెక్టర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ తీయబోతున్న సినిమాకి నూతన నటీనటులు కావాలని పేర్కొన్నారు ఆసక్తి ఉన్నవారు 9908 11 7056 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.