వీధి దీపాల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా
ప్రజాశక్తి- పుత్తూరు టౌన్: పట్టణంలోని పురపాలక సంఘం పరిధి 12వ వార్డులో పుత్తూరు పురపాలక సంఘం 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన 800 మీటర్లు (చిన్నబ్బనాయుడు కండ్రిగ నుంచి కుందిమాకుల గుంట ఎస్టీ కాలనీ వరకు) సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నగరి నియోజకవర్గం శాసన సభ్యురాలు ఆర్ కే రోజా చేతుల మీదుగా ఆదివారం భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామస్తులు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ హరి వైస్ చైర్మన్‌లు డి.శంకర్, డి జయ ప్రకాష్, అవార్డ్ 12 కౌన్సిలర్ చిట్టి బాబు, ఎంపీపీ ముని వేలమ్మ, న్యాయవాది రవీంద్ర, ఆరేటమ్మ ఆలయ చైర్మన్ మనోహర్ రెడ్డి, మహీన్, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










