Aug 28,2022 23:10

కాణిపాకం ఆలయంలో ఆవిష్కరణ
శిలాఫలకంపై తప్పులు సరిదిద్దండి: భక్తుల విజ్ఞప్తి
ప్రజాశక్తి- ఐరాల

కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ది వినాయకస్వామి వారి ఆలయంలో ఇంజినీరింగ్‌ శాఖ అధికార్లు ఏర్పాటు చేసిన ఆవిష్కరణ శిలాఫలకంపై ఉన్న తప్పుడు రాతలను సరిదిద్దాలని పలువురు భక్తులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ది వినాయక స్వామివారి ఆలయ అభివద్ధి కార్యక్రమాలలో భాగంగా గాయత్రిదేవి, ఐకారవి, యుఎస్‌ఎ, జానికి గుత్తికొండా శ్రీనివాస్‌, యుఎస్‌ఎ అనే దాతలు సహకారంతో రూ.10కోట్లు వ్యయంతో ప్రధాన ఆలయ పునఃనిర్మాణం పనులు చేసినారు.
ఈ పునఃనిర్మాణ ఆలయం ప్రారంభం నిమ్మితం ఈనెల 21వ తేది ఆదివారం చతుర్వేద హావన సహిత మహాకుంభాభిషేకం సందర్భంగా ప్రముఖులు, దాతలు, పేర్లు రాయబడిన ఒక నాణ్యమైన విలువైన ఆవిష్కరణ శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఈ ఆవిష్కరణ శిలాఫలకంను వేలూరు బంగారు ఆలయం పీఠాధిపతి శ్రీ నారాయణి అమ్మన్‌ చేతులు మీదగా ఈనెల 21వ తేది ఆదివారం ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ శిలాఫలకం పైన ప్రారంభకులు పేరు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రముఖ్యమంత్రి వర్యులు అని పేరును సష్టానంగా ప్రోటోకాల్‌ ప్రకారం ముద్రించి ఉండాలి. అయితే ఆలయ ఇంజనీరింగ్‌ శాఖ అధికార్లు అశ్రద్ధ కారణంగా అందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర (రాష్ణ) ముఖ్యమంత్రి వర్యులు అని తప్పుడు రాత అక్షరాలను ముద్రించినారు. శిలాఫలకంపై తప్పుడు అక్షరాలు ముద్రించడం చేత స్వామి వారి సందర్శనార్థం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహా రాష్ట్రం, తెలంగాణా వంటి పోరుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చే భక్తులు కాకుండా, స్థానికులు ప్రముఖులు అవిష్కరించిన శిలాఫలకంపై ఆలయ ఇంజనీరింగ్‌ శాఖ అధికార్లు నిర్లక్ష్యం వైఖరి అవలంభించడం చేత తప్పుడు రాతలు దర్శనమిస్తున్నాయని తప్పులు అక్షరాలను గుర్తించి పలువురు భక్తులు, స్థానికులు చర్చించికుంటున్నారు. విలువైన నాణ్యమైన ప్రోటోకాల్‌ శిలాఫలకంపై ఉన్న తప్పుడు రాతలను ఆలయ అధికార్లు గమనించకపోవడం గమనార్హం అని భక్తులు అంటున్నారు. కావున ఇప్పటికైనా ఆలయ కార్యనిర్వాహణాధికారి, ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మెన్లు స్పదించి ప్రోటోకాల్‌ ఆవిష్కరణ శిలాఫలకంపై ఉన్న తప్పుడు అక్షరాలను పరిశీలించి సరిదిద్ధి తప్పుడు అక్షరాలు లేకుండా చూడాలని పలువురు భక్తులు, స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.