Sep 15,2023 22:33

గంగాధర నెల్లూరులో చంద్రబాబు కోసం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న పొన్న యుగంధర్‌, డాక్టర్‌ థామస్‌..

సీటు ఎవరికో...
- నియోజకవర్గంలో మొదలైన చర్చ
- ఒకరు అందరికీ తెలిసిన వారే..
మరొకరు కొత్తగా వచ్చిన వారు..
- జనసేన, టిడిపిలు ఒకటి కావడంతో ఇద్దరిలో ఎవరో..?
ప్రజాశక్తి -వెదురుకుప్పం:గతంలో జనసేన, టిడిపిలు వేరువేరుగా పోటీ చేస్తాయని అధిష్టానం చెబుతూ ఉండేది. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన, టిడిపిలు రెండు కలిసి ముందుకు వెళుతున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. దీంతో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో టికెట్టు ఎవరికి వస్తుందోనని చర్చ మొదలైంది. ఇక అసలు విషయానికి వస్తే గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ప్రస్తుతం డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇతను వైసిపి అభ్యర్థి.. ప్రస్తుతం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. కార్వేటి నగరం, పాలసముద్రం, ఎస్‌ ఆర్‌పురం, గంగాధర నెల్లూరు, పెనుమూరు, వెదురు కుప్పం మండలాలు ఉన్నాయి. ఈ నియోజక వర్గం పునర్విభజన తర్వాత ఎస్‌సి రిజర్వేష న్‌కు కేటాయించారు. ఈ నేపథ్యం లో జనసేన తరపున పొన్న యుగంధర్‌, టిడిపి తరఫున థామస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యులుగా ఉన్నారు. వీరే టికెట్టు ఆశిస్తున్నారు. ప్రస్తుతం రేసులో ఉన్నారు. స్థానికుల అభిప్రాయం మేరకు జనాలలో ఇప్పుడు ఉంటూ..ప్రజలకు ఏ కష్టమైనా ఏదైనా సమస్య ఉన్న వెంటనే స్పందించే వ్యక్తి పొన్న యుగంధర్‌ అని చెబుతున్నారు. సమస్యల పోరాటం కోసం ఎక్కువగా స్పందించే వ్యక్తి.. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలపై పోరాటం చేసి పరిష్కరించిన వ్యక్తి కూడా యుగంధరే.. అందరికీ తెలిసిన వ్యక్తి.. కార్వేటినగరం మండ ల మే..ఇక టిడిపి అభ్యర్థి అయిన థామస్‌ కార్వేటి నగరం మండలానికి చెందిన వ్యక్తి. వత్తిరీత్యా చెన్నైలో స్థిరపడ్డారు. వివిధ నగరాల్లో ప్రముఖంగా వైద్యా నికి సంబంధించిన బ్రాంచీ లు ఉన్నాయి. ఎవరి వైపు అధిషా ్టనం మొగ్గు చూపుతుందో వేచి చూడాలని స్థానికులు చెబుతు న్నారు. ఎవరికి ఇచ్చినా కలిసి కట్టుగా పని చేస్తా మంటున్నారు.
గంగాధర నెల్లూరులో చంద్రబాబు కోసం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న
పొన్న యుగంధర్‌, డాక్టర్‌ థామస్‌..