Mar 30,2023 22:27

కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎస్‌పి ఫక్కీరప్ప దంపతులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌       శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వాటర్స్‌లోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి దంపతులు కుటుంబ సమేతంగా హాజరై సీతారాముల కళ్యాణం నిర్వహించారు. జిల్లాలో వర్షాలు బాగా కురిసి రైతుల ఇంట సిరులు కురియాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోసాలతో జీవించాలని కాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, ఎ.హనుమంతు (ఎఆర్‌) దంపతులు, ఎస్‌బి సిఐ చక్రవర్తి, డిసిఆర్‌బి సిఐ విశ్వనాథ్‌ చౌదరి, టెక్నికల్‌ ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడ్‌హక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌ నాథ్‌, సుధాకర్‌ రెడ్డి, తేజ్‌పాల్‌, సరోజ, రామాలయం కమిటీ సభ్యులు గాండ్ల హరినాథ్‌, నాగరాజు, లింగమయ్య, ఆర్‌ఎస్‌ఐ లు రాజశేఖర్‌ రెడ్డి, భాస్కర్‌, ప్రవీణ్‌ కుమార్‌, రమేష్‌ నాయక్‌, రిటైర్డ్‌ పోలీసు అధికారులు, పోలీసు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.