ప్రజాశక్తి -సీతారాపురం :వెనుకబడిన ఉదయగిరి ప్రాంతం శిలాఫలకాలకే పరిమితమైందని, అభివృద్ధికి నోచుకోలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. జిల్లా సమగ్రాభివద్ధి కోరుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో మూడు బృందాలు పాదయాత్రలకు శ్రీకారం చుట్టాయి.అందులో భాగంగా రెండో పాదయాత్రను మంగళవారం సీతారామపురం మండలం, బసినేనిపల్లి వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ పాదయాత్రలో పాల్గొ నేందుకు కార్యకర్తలు భారీగా వచ్చారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉదయగిరి ప్రాంతం ఎంతో వెనకబడి ఉందన్నారు. వలసలకు నిలయంగా ఆ ప్రాంతం ఉందన్నారు. ఈ ప్రాంతంలోని సీతారామ సాగర్ ప్రాజెక్ట్ కోసం ఎంతోకాలంగా సిపిఎం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఇంతవరకు ఆ ప్రాజెక్టు నిర్మాణంపై అతి గతి లేదన్నారు. రాష్ట్రంలో అభివద్ధి లేకపోగా శిలాఫలకాలు మాత్రం మిగిలాయన్నారు. ఇప్పటికైనా సీతారామ సాగర్ ప్రాజెక్టును నిర్మించి ఇక్కడి పేదల కలలను సాకారం చేయాల న్నారు. కరువు సహాయక కార్యక్రమాలు చేపట్టి ఇన్పుట్ సబ్సిడీలను ఇచ్చిన రుణాలను రద్దు చేయాలన్నారు. కేంద్రం నుంచి ఉచిత బీమా పథకాన్ని తీసుకొచ్చి నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు పని కల్పించి నిర్దిష్టమైన కనీస వేతనాన్ని అందజేస్తే వలసలను నివారించవచ్చన్నారు. ఈనెల 13న నెల్లూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, అనంతరం వచ్చే నెల 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరని సమీకరించి భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజారక్షణ భేరి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. తాగు తాగునీరు లేక ఉదయగిరి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టున్నారన్నారు. ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేసి వలసలను నివారించాలన్నారు. ఇక్కడి కరువు ప్రాంతాల రైతులను ఆదు కోవడానికి రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకతి సహకరిస్తున్నా, పాలకుల నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అభివద్ధి అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారే తప్ప ఎక్కడా పనులు జరగినట్లు కనిపిం చడంలేదన్నారు. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి తమకు కావాల్సిన వనరుల కోసం పోరాడాలన్నారు. కష్ణా జలాలను శ్రీశైలం వద్ద నుంచి ఒక కాలువ ద్వారా వెలుగొండ ప్రాజెక్టుకు మరొక కాలువ ద్వారా సీతారామ సాగర్‌ను నిర్మించి నీరు అందిస్తే ఉదయగిరి, ఆత్మకూరు, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన జరుగు తున్నాయన్నారు. అక్కడ భూముల కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వలేదన్నారు. పనులు నిదానంగా జరుగుతున్నాయన్నారు. సీతారామ సాగర్ పనులు కనీసం చేపట్టకపోవడం పట్ల ఇక్కడి ప్రాంత ప్రజలపై పాలకులు చిన్న చూపు చూపుతున్నారని అభిప్రా యపడ్డారు. ఉదయగిరి నియోజకవర్గ అభివద్ధికి ఇప్పటివరకు ఎటువంటి ప్రణాళికలు రూపొందించలేదన్నారు. అందువల్ల వెనుకబడిన మెట్ట ప్రాంతమైన సీతారామపురం మండలంలోని బసినేని పల్లి గ్రామం నుంచి తమ పోరాటాన్ని ప్రారంభి స్తున్నామన్నారు. ఈ నెల 13న నెల్లూరులో భారీ బహిరంగ సభను నిర్వహించి జిల్లా సమగ్ర అభివద్ధి సాధన కోసం భవిష్యత్తు కార్యకారణ రూపొందిస్తామన్నారు. రైతు, వ్యవసాయ, కార్మిక ,కర్షక, ఉద్యోగ ఉపాధ్యాయ అన్ని సంఘాల తో ఇతర నాయకులతో మేధావులతో చర్చించి వారిని కలుపుకొని పోయి పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రాజెక్టులను,కంపెనీలను పూర్తి చేయడానికి సుమారు లక్ష కోట్ల ప్యాకేజీ ఇస్తే తప్ప ఈ ప్రాంతం అభివద్ధి చెందదు అని చెప్పిన మోడీ ఇప్పుడు మాట తప్పారన్నారు. అప్పట్లో కమ్యూనిస్టు పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు కనీసం ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా అయిన ఇవ్వాలని అడగారన్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి ఐదు కాదు.. పదేళ్లు తెలిపి అధికారంలోకి రాగానే మాట తప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మొండిచేయి చూపారన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ చేసిన ద్రోహం ప్రజలు మర్చిపోలేదన్నారు. అత్యధిక ఎంపీ స్థానాల్లో వైసిపిని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన వెంటనే బిజెపి ప్రభుత్వానికి భయపడి ప్రత్యేక హౌదా పోరాటాన్ని పక్కనపెట్టిందన్నారు. అదాని లాంటి కంపెనీలకు రాష్ట్రాన్ని వైసిపి రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెడుతుందన్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా భూములు, ఇళ్లను కోల్పోతున్నామని ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని పలువురు గ్రామ స్తులు ఆయన దష్టికి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కటారి అజరు కుమార్, మూళి వెంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు ముత్యాల గురునాథం, లక్ష్మీపతి, ఎం. పుల్లయ్య ,జి. నాగేశ్వరరావు, జిల్లా నాయకులు కాకు వెంకటయ్య, మండల సిపిఎం నాయకులు కోడె రమణయ్య, ఫరుద్దీన్ భాష, దుత్తలూరు సిపిఎం నాయకులు మల్లికార్జున, రసూల్ సాహెబ్, నాయకుడు నరసింహ, ఐద్వా నాయకురాలు ప్రమీలమ్మ, కామాక్షమ్మ, శ్యామలమ్మ పాల్గొన్నారు.










