ప్రజాశక్తి - భీమవరం రూరల్
టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసినవారిని అరెస్టు చేయాలని టిడిపి నాయకులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన చంద్రబాబు పర్యటనను విఫలం చేయాలని కుట్రతో పార్టీ నాయకురాలు తోట సీతారామలక్ష్మి మృతి చెందారని శ్రద్ధాంజలి ఫొటోను ఫేస్ బుక్‌లో పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ టిడిపికిి అంకితభావంతో పనిచేస్తున్న తోట సీతారామలక్ష్మిపై అసత్య ప్రచారం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యంరాజు మాట్లాడుతూ భీమవరం మున్సిపల్ ఛైర్మన్‌గా రాజ్యసభ సభ్యురాలుగా గౌరవప్రదమైన పదవులు నిర్వహించిన తోట సీతారామలక్ష్మిపై అసత్య ప్రచారాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రేవు వెంకన్న, కొయ్యలగడ్డ గణపతి, మామిడిశెట్టి ప్రసాద్, మాదాసు కనకదుర్గ, గునుపూడి తిరుపాల్ పాల్గొన్నారు.










