ప్రజాశక్తి - వీరవాసరం
రాజకీయాలు అభివృద్ధికి బాసట కావాలని, నిరోధం కాకూడదని ఎంపిపి వీరవల్లి దుర్గాభవాణి అన్నారు. మండలంలోని తోలేరు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులను సోమవారం ఎంపిపి దుర్గాభవాణి ప్రారంభించారు. తోలేరు పంచాయతీ పరిధిలోని ఉత్తరపాలెంలో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు తన ఎంపీ గ్రాంట్‌ను నుంచి రూ.పది లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపిపి ప్రారంభించారు. దాతలు నూకల వెంకటేశ్వరరావు రూ.రెండు లక్షలు, మరికొంత మంది దాతలు సమకూర్చిన రూ.మూడు లక్షలతో కలిపి తోలేరు శ్మశానంలో దహన సంస్కారాలు చేసేందుకు నిర్మించిన షెడ్డును ఎంపిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి వేండ్ర లీలాకృష్ణ, ఉపసర్పంచి భోగిరెడ్డి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు వీరవల్లి చంద్రశేఖర్, నూకల ఆంజనేయులు, అడబాల వెంకట్రావు పాల్గొన్నారు.










