Jan 20,2023 20:52

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నగరంలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు పటిష్టచర్యలు తీసుకుంటున్నట్లు నగర మేయర్‌ ఎస్‌.అముద చెప్పారు. శుక్రవారం 'ఫ్రైడే డ్రైడే' కార్యక్రమాన్ని పురస్కరించుకొని 39వ వార్డు పరిధిలో వైద్యఆరోగ్యశాఖ, నగరపాలక అధికారులతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా డెంగీ జ్వరాల నివారణపై వార్డులో ప్రజలకు అవగాహన కల్పించారు. గహాల్లో, ఇంటి పరిసరాల్లో నిల్వ నీటి కారణంగా దోమలు పెరిగి విషజ్వరాలు ప్రబలుతున్నాయని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తమై నిల్వ నీరు లేకుండా చూడాలన్నారు. నీటిని నిల్వచేసే పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని డ్రైడే పాటించాలన్నారు. అధికారులతో కలిసి పలు గహాలను పరిశీలించారు. డెంగీ నియంత్రణ కోసం రూపొందించిన అవగాహన కరపత్రాలను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు.