ప్రజాశక్తి - పెనుమంట్ర
ఇటీవల సీజ్ చేసిన మోటార్ సైకిళ్ల వేలం వేసినట్లు తణుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ ఆర్.సత్యవతి అన్నారు. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో సీజ్ చేసిన రెండు మోటార్ సైకిళ్లను పెనుగొండ సిఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేలం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. షైన్ బైక్‌ను రూ.7 వేలకు, పల్సర్ బైక్ రూ.10,500లకు వేలం వేసినట్లు తెలిపారు. వేలం వేసిన వీటికి 18 శాతం జిఎస్‌టి పాట యజమాని చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ బి.సురేంద్రకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.










