Aug 23,2023 22:20

సీఎం సభను విజయవంతం చేద్దాం: కలెక్టర్‌
పర్యటన ఏర్పాట్లను, బహిరంగ సభ, హెలిపాడ్‌ ప్రదేశాల పరిశీలన
ప్రజాశక్తి- నగరి:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఈనెల 28న చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు రానున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఈనెల 28న నిర్వహించనున్న జగనన్న విద్యాదీవెన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులుతో కలసి బహిరంగ సభ, ముఖ్యమంత్రి అరైవల్‌, డిపార్చర్‌లకు హెలిపాడ్‌ ప్రదేశాలను పరిశీలించారు. ఈపర్యటనలో జిల్లా కలెక్టర్‌ వెంట నగరి ఆర్డీఓలు సుజన, మున్సిపల్‌ కమీషనర్‌ వెంకట రమణారెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం నగరి మున్సిపల్‌ కార్యాలయంలో సంబంధిత జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆగమనం, తిరుగు ప్రయాణానికి సంబంధించి హెలిప్యాడ్‌ నిర్మాణం ఏర్పాట్లను పర్యవేక్షించాలని, హెలిప్యాడ్‌ నుండి ముఖ్యమంత్రి రోడ్‌షోగా నగరిలోని టవర్‌ క్లాక్‌, మున్సిపల్‌ ఆఫీసు మీదుగా సభా వేదికకు రానున్న సందర్భంగా దారి పొడవునా బ్యారీకేడ్‌లు ఏర్పాటుచేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. సభావేదిక దగ్గర ప్రభుత్వ అభివద్ధి కార్యక్రమాల్లో భాగంగా 3 నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చూసుకోవాలని తెలిపారు. లబ్ధిదారులతో గ్రూప్‌ ఫోటోకు సంబంధించి ఏర్పాట్లను డిఆర్డిఏ పిడి తులసిని పర్యవేక్షించాలని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి శాఖల వారీగా వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో ఎఎస్‌పి సుధాకర్‌, జడ్పీ సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి, పిఆర్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ఈలు చంద్రశేఖర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, ఏపీ ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ కష్ణారెడ్డి, హౌసింగ్‌ పీడీ పద్మనాభం, డ్వామా, మెప్మా, డిఆర్‌డిఏ పిడిలు తులసి, రాధమ్మ, గంగాభవాని, సాంఘిక సంక్షేమ అధికారి రాజ్యలక్ష్మి, డిఎం అండ్‌హెచ్‌ ఓ డాక్టర్‌ ప్రభావతి, డీఈఓ విజయేంద్ర రావు, సమగ్ర శిక్ష ఏపీసి వెంకట రమణారెడ్డి, సిపిఓ ఉమాదేవి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, చిత్తూరు, కుప్పం ఆర్డీఓలు రేణుక, శివయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ కిరణ్మయి సంబంధింత అధికారులు పాల్గొన్నారు.